ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్.. టాప్ 10లో పాకిస్థాన్ బ్యాటర్
ABN , Publish Date - Jul 28 , 2026 | 07:10 PM
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ జాబితా విడుదల అయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్ తగిలింది. పాకిస్థాన్ బ్యాటర్ సిద్రా అమీన్.. హర్మన్‌ను వెనక్కి నెట్టి టాప్ 10లో స్థానం సంపాదించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్ జాబితా విడుదల అయింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు షాక్ తగిలింది. శ్రీలంకతో జరుగుతున్న ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పాకిస్థాన్ బ్యాటర్ సిద్రా అమీన్.. రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో ఒక స్థానం మెరుగుపరుచుకుని వన్డే ర్యాంకింగ్స్ జాబితాలో తొమ్మిదో ర్యాంక్‌కు ఎగబాకింది. ఈ క్రమంలో హర్మన్‌ను వెనక్కి నెట్టి టాప్ 10లో స్థానం సంపాదించింది.
ఈ జాబితాలో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అగ్రస్థానానికి నిలబెట్టుకుంది. టాప్ 8 స్థానాల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. కాగా సిద్రా 671 పాయింట్లతో తొమ్మిదో స్థానానికి ఎగబాకగా.. హర్మన్ 652 పాయింట్లతో పదో స్థానానికి పడిపోయింది. శ్రీలంకతో సిరీస్‌లో నిలకడగా పరుగులు చేసిన పాకిస్థాన్ ఓపెనర్ గల్ ఫెరొజా ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 54వ ర్యాంక్‌కు చేరుకుంది. మరోవైపు రెండో వన్డేలో 273 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక విజయవంతంగా ఛేదించడంతో ఆ జట్టు ఆటగాళ్లకు కూడా ర్యాంకింగ్స్‌లో భారీ లాభం కలిగింది. శ్రీలంక బ్యాటర్ విష్మి గుణరత్నే16 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరింది. అలాగే హర్షిత సమరవిక్రమ 17వ స్థానానికి, నిలాక్షిక సిల్వ 24వ స్థానానికి, కవిశా దిల్హారి 38వ స్థానానికి ఎగబాకారు.
శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగు పరుచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకుంది. బౌలర్ల జాబితాలో కూడా మూడు స్థానాలు ఎగబాకింది. కవిశా దిల్హారి బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొమ్మిది స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా 36వ స్థానంలో నిలవగా, ఆల్‌రౌండర్ల జాబితాలో 14వ స్థానానికి చేరుకుంది. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత ప్లేయర్ దీప్తి శర్మ 343 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ రాజీనామా.. ఐపీఎల్‌లో చేరేందుకు సిద్ధం!