Share News

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:21 PM

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 స్విమ్మింగ్ పోటీల్లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
Srihari Nataraj

ఇంటర్నెట్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 స్విమ్మింగ్ పోటీల్లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. హీట్స్‌లో 55.58 సెకన్ల టైమింగ్‌తో తన గ్రూప్‌లో ఐదో స్థానంలో.. మొత్తంగా 13వ స్థానంలో నిలిచి సూపర్ 16లో చోటు దక్కించుకున్నాడు. 25 ఏళ్ల శ్రీహరి 50 మీటర్ల మార్క్‌ను 26.26 సెకన్లలో పూర్తి చేశాడు. కాగా 2021లో నమోదు చేసిన 53.77 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ రికార్డు కూడా అతడి పేరు మీదే ఉండటం విశేషం.


మరోవైపు భారత సీనియర్ స్విమ్మర్ సజన్ ప్రకాశ్‌కు 50 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో నిరాశ ఎదురైంది. హీట్స్‌లో 24.94 సెకన్ల టైమింగ్‌తో తన గ్రూప్‌లో ఎనిమిదో స్థానం, మొత్తంగా 28వ స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించాడు. అతడి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 23.83 సెకన్లు కాగా, అదే జాతీయ రికార్డుగా ఉంది. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న సజన్.. అంతకుముందు 200 మీటర్ల బటర్‌ఫ్లై ఫైనల్లో కూడా 1:58.05 సెకన్లతో చివరి స్థానంలో నిలిచాడు. మరోవైపు శ్రీహరి నటరాజ్ భారత పురుషుల 4x200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే జట్టులో సభ్యుడిగా ఫైనల్‌లో పోటీ పడి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.


కామన్వెల్త్ గేమ్స్ స్విమ్మింగ్‌లో భారత్ తరఫున ఇప్పటివరకు పతకం సాధించిన ఏకైక స్విమ్మర్ ప్రసంతా కర్మాకర్ మాత్రమే. అతడు 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్ ఎస్9 పారా ఈవెంట్‌లో కాంస్య పతకం గెలిచారు. దీంతో శ్రీహరి నటరాజన్ పతకం గెలిచి చరిత్ర సృష్టిస్తాడా అనేది చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్: సబలెంకాతో జతకట్టనున్న జకోవిచ్

విదేశాల్లో భారత బ్యాటర్ల వైఫల్యానికి బౌండరీలే కారణం: సునీల్ గావస్కర్

Updated Date - Jul 28 , 2026 | 06:21 PM