భువీని టీమిండియాలోకి తీసుకోవాలి.. బీసీసీఐకి సెహ్వాగ్ సూచన
ABN , Publish Date - May 02 , 2026 | 04:00 PM
ఆర్సీబీ స్టార్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్న భువీ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని కోరాడు. అతడికి మరొక అవకాశం కల్పించి టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నాడు. బ్యాటర్లు దూకుడుగా ఆడే టీ20ల్లో భువీ తన స్వింగ్ బౌలింగ్‌తో సత్తా చాటుతున్నాడు. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన అతడు 17 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను తన దగ్గరే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో భువనేశ్వర్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్న భువీ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని కోరాడు. అతడికి మరొక అవకాశం కల్పించి టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు.
‘వయసు.. ఒక నంబర్ మాత్రమే అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. భువనేశ్వర్ కుమార్‌కు ఇప్పుడు 35 ఏళ్లు ఉండొచ్చు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. అలాంటప్పుడు టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు రీఎంట్రీపై ఆలోచన చేయడంలో తప్పులేదు. సెలక్టర్లూ దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. బుమ్రా, భువనేశ్వర్ కుమార్ కాంబినేషన్‌ను ఇప్పటికే చూశాం. మరోసారి అలా ప్రయత్నించొచ్చు. భువీ బౌలింగ్‌లో ఇప్పటికీ ఆ షార్ప్‌నెస్ తగ్గలేదు. మునుపటి భువీని చూస్తున్నట్లే అనిపిస్తోంది. అందుకే అతడు మళ్లీ జాతీయ జట్టులోకి అడుగు పెట్టేందుకు ఆలోచనలు చేయాలి’ అని సెహ్వాగ్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే