నా నిర్ణయంలో మార్పు లేదు.. క్లాసెన్ సంచలన ప్రకటన
ABN , Publish Date - May 02 , 2026 | 02:53 PM
ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే క్లాసెన్ తన రిటైర్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. మిడిలార్డర్‌లో ఎస్ఆర్‌హెచ్‌కు కీలక ప్లేయర్‌గా క్లాసెన్ మారాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ అతడి బ్యాట్ నుంచి భారీగానే పరుగులు వచ్చాయి. ఐపీఎల్‌లో భీకర ఫామ్‌లో ఉన్న క్లాసెన్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సూచించాడు.
'దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఒక్క ప్రపంచకప్ కూడా గెలవలేదు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ వారి సొంతగడ్డపైనే జరగనుంది. కాబట్టి సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వెంటనే అతడికి ఫోన్ చేసి, రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని జట్టులో చేరమని కోరాలి'అని పీటర్సన్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయంపై క్లాసెన్ స్పందించాడు.
తాను తిరిగి జాతీయ జట్టుకు ఆడాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. 'ఇప్పుడు నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో రోటర్‌డామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాను. ఈ లీగ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే నా లక్ష్యమని' క్లాసెన్ పేర్కొన్నాడు. కాగా క్లాసెన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే