ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ABN , Publish Date - May 02 , 2026 | 12:13 PM
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే తొలి భారత్ ఓపెనర్‌గా నిలిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే పంజాబ్ కింగ్స్ పై 152 పరుగులతో చెలరేగిన రాహుల్.. మరోసారి రాజస్థాన్ రాయల్స్ పై మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్య ఛేదనలో 75 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ప్రస్తుతం 9 మ్యాచుల్లో 433 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈక్రమంలో ఓ అరుదైన రికార్డును కేఎల్ రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
నిన్న(శుక్రవారం) రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో 200 ప్లస్ సిక్స్‌లు కొట్టిన తొలి భారత ఓపెనర్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో మరే భారత్ ఓపెనర్ ఈ రికార్డును అందుకోలేదు. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఓపెనర్‌గా ముగ్గురు మాత్రమే 200 సిక్స్‌లు కొట్టారు. అందులో కేఎల్ రాహుల్ మూడో ప్లేయర్. అతడు112 మ్యాచుల్లో ఓపెనర్‌గా ఆడాడు. ప్రస్తుతం రాహుల్ ఖాతాలో 203 సిక్స్‌లు ఉన్నాయి.
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా కేఎల్ 50.01 సగటున 141.38 స్ట్రైక్‌రేట్‌తో 4,851 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువగా వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ 326 సిక్స్‌లు కొట్టాడు. అతడి తర్వాత సన్‌రైజర్స్‌కు సారథిగా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ 210 సిక్స్‌లు బాదాడు. ఆ తర్వాతి స్థానంలో కేఎల్ రాహుల్(203) మూడో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ సీజన్‌లోనే కేఎల్ రాహుల్ రెండో స్థానానికి చేరుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ ఇంకా ఐదు లీగ్ మ్యాచులు ఆడాల్సిఉంది. ఈ క్రమంలో వార్నర్‌ను కేఎల్ అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే
కివీస్‌కు భారీ షాక్.. ఇంగ్లండ్ టూర్‌కి స్టార్ ప్లేయర్ దూరం