Share News

ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే

ABN , Publish Date - May 02 , 2026 | 11:06 AM

ఐపీఎల్‌లో మ్యాచ్ గెలుపుపై ప్రభావం చూపిన వారికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(POTM)' అవార్డును అందజేస్తుంటారు. పలువురు టీమిండియా ప్లేయర్లు గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో రాణిస్తూ.. ఒంటరిగా మ్యాచ్‌లను గెలిపించారు.

ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే
Most Player of the Match IPL

స్పోర్ట్స్ డెస్క్: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 క్రికెట్ ప్రియులను ఎంతగానో అలరిస్తోంది. మరోవైపు సీజన్‌లో సగం మ్యాచులు పూర్తి కావడంతో ప్లే ఆఫ్స్‌కు చేరాలని అన్ని జట్టులు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇక మ్యాచుల్లో నిలకడగా ఆడుతూ.. మ్యాచ్ గెలుపుపై ప్రభావం చూపిన వారికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(POTM)' అవార్డును అందజేస్తుంటారు. పలువురు టీమిండియా ప్లేయర్లు గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో ఒత్తిడిలో రాణిస్తూ.. ఒంటరిగా మ్యాచ్‌లను గెలిపించారు. ఐపీఎల్‌లో అత్యధిక POTM అందుకున్న టాప్ ఇండియన్ ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..Dhoni.jpg


రోహిత్ శర్మ:

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటి వరకు 21 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఓపెనర్ 270కి పైగా మ్యాచ్‌లు ఆడాడు. అన్ని సీజన్‌లలో నిలకడగా ఆడటమే కాకుండా మ్యాచ్ గెలిపించే ప్రదర్శనలను చేశాడు.

విరాట్ కోహ్లీ:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ 20 సార్లు పీవోటీఎం అవార్డును అందుకున్నాడు. ఆర్సీబీ తరఫున 270కి పైగా మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఐపీఎల్‌లో మోస్ట్ పవర్ ఫుల్ ప్లేయర్లలో ఒకటిగా నిలిచాడు.

ఎంఎస్ ధోని:

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 18 అవార్డులతో ధోని ఐపీఎల్‌లో అత్యంత ప్రభావవంతమైన ఫినిషర్లలో ఒకడిగా నిలిచాడు. ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడిన ధోని మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రశాంతమైన కెప్టెన్సీతో పాటు ఫినిషింగ్ సామర్థ్యంతో ధోని సీఎస్కే జట్టుకు అనేక విజయాలను అందించాడు.Jadeja.jpg


రవీంద్ర జడేజా:

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 4వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు అతడు 264 మ్యాచ్‌లలో 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ తో తన సత్తా చూపిస్తూ.. మ్యాచ్ విన్నర్ గా నిలుస్తుంటాడు. ఇక జడేజా ఫీల్డింగ్‌లో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. అనేక సందర్భాల్లో తన అద్భుతమైన ఫీల్డింగ్ తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. గతంలో సీఎస్కే తరఫున ఆడిన జడేజా, ప్రస్తుతం రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

కేఎల్ రాహుల్:

కేఎల్ రాహుల్ 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో 150కి పైగా మ్యాచ్‌లు ఆడాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా అతడు నిలకడగా రాణిస్తున్నాడు. అలానే ఒత్తిడి పరిస్థితుల్లో రాణించగల సామర్థ్యం రాహుల్ సొంతం. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రాహుల్ ఇటీవలే పంజాబ్ కింగ్స్‌పై 152 పరుగులతో అజేయంగా నిలిచాడు.


ఇవి కూడా చదవండి:

ఆ యువకులకు ఈ విజయం అంకితం: అక్షర్ పటేల్

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. యువ బౌలర్లు దూరం

Updated Date - May 02 , 2026 | 12:19 PM