వైభవ్‌ను ఔట్ చేశాక అతిగా సంబరాలు.. జేమీసన్‌కు బీసీసీఐ షాక్
ABN , Publish Date - May 02 , 2026 | 02:48 PM
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేశాక ఢిల్లీ బౌలర్ జేమీసన్ అతిగా సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. చప్పట్లు చరుస్తూ అతడికేసి చూసి సెండాఫ్ ఇవ్వడంతో జేమీసన్‌పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జేమీసన్ అతి సంబరాలపై స్పందించిన బీసీసీఐ అతడికి షాకిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ఔట్ చేశాక ఢిల్లీ బౌలర్ జేమీసన్ అతిగా సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. వైభవ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాక.. చప్పట్లు చరుస్తూ అతడికేసి చూసి సెండాఫ్ ఇవ్వడంతో జేమీసన్‌పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఓ పదిహేనేళ్ల కుర్రాడిని ఔట్ చేసి ఇంతలా సంబరాలు చేసుకుంటున్నారంటే.. వైభవ్ బౌలర్లకు ఎంతటి భయం కలిగించాడో అర్థం అవుతుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో జేమీసన్ అతి సంబరాలపై స్పందించిన బీసీసీఐ అతడికి షాకిచ్చింది. ప్రత్యర్థి బ్యాటర్‌ను ఉద్దేశించి అనుచితంగా ప్రవర్తించడంపై ఒక డీమెరిట్ పాయింట్‌ను విధిస్తూ హెచ్చరికలు జారీ చేసింది.
‘కేల్ జేమీసన్‌కు ఒక డీమెరిట్ పాయింట్ విధించాం. అలాగే మున్ముందు ఇలా వ్యవహరించకుండా ఉండాలని హెచ్చరించాం. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్ జేమీసన్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు తేలింది. ఆర్టికల్ 2.5 నిబంధన ప్రకారం.. ప్రత్యర్థి ప్లేయర్‌ను ఉద్దేశించి అసభ్యకరమైన భాష, అనుచిత సైగలు చేయడం నిషిద్ధం. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాత జేమీసన్ ప్రవర్తన అనుచితంగా ఉంది. అతడికి దగ్గరగా వెళ్లి మరీ సంబరాలు చేసుకోవడం సరికాదు. మ్యాచ్ రిఫరీ ఆదేశాల మేరకు జేమీసన్‌కు డీమెరిట్ పాయింట్ జారీ చేశాం. అతడు కూడా దానిని అంగీకరించి క్షమాపణలు చెప్పాడు’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో వెల్లడించాడు.
వైభవ్ నన్ను భయపెట్టాడు: జేమీసన్
వైభవ్ సూర్యవంశీని ఔట్ చేశాక తాను ప్రవర్తించిన తీరుపై జేమీసన్ స్పందించాడు. అతడు మాట్లాడిన వీడియోను ఐపీఎల్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ‘నేను 15 ఏళ్ల కుర్రాడికి భయపడతానని అనుకోలేదు. అయితే మేం అతడిని ఔట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుని బరిలోకి దిగాం. అవి సత్ఫలితాలను ఇచ్చాయి. రాజస్థాన్ రాయల్స్‌కు టాప్ 2 ప్లేయర్లే బలం. మిచెల్ స్టార్క్ తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్‌ను ఔట్ చేశాడు. నేను యార్కర్‌తో వైభవ్‌ను పెవిలియన్‌కు పంపాను. వారిద్దరిని త్వరగా ఔట్ చేయడం మాకు కలిసొచ్చింది’ అని జేమీసన్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్..
ఐపీఎల్‌లో అత్యధిక 'పీవోటీఎం' అవార్డులు అందుకున్న ప్లేయర్లు వీరే