Share News

సంజును తప్పించకుండానే వైభవ్‌కు ఛాన్స్.. దినేశ్ కార్తీక్ మాస్టర్ ప్లాన్ ఇదే!

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:02 PM

కివీస్‌తో ఐదో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం ఇవ్వాలా? సీనియర్ ఆటగాడు సంజు శాంసన్‌ను కొనసాగించాలా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర పరిష్కారాన్ని సూచించాడు.

సంజును తప్పించకుండానే వైభవ్‌కు ఛాన్స్.. దినేశ్ కార్తీక్ మాస్టర్ ప్లాన్ ఇదే!
Dinesh Karthik

ఇంటర్నెట్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను ఘనంగా ముగించాలని భావిస్తోంది. అయితే ఐదో టీ20లో తుది జట్టు ఎంపిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం ఇవ్వాలా? సీనియర్ ఆటగాడు సంజు శాంసన్‌ను కొనసాగించాలా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర పరిష్కారాన్ని సూచించాడు.


‘వైభవ్ ఆడాలని అందరూ కోరుకుంటున్నారని నాకు తెలుసు. అతడిని జట్టులోకి తీసుకోవాలంటే అభిషేక్‌కు విశ్రాంతి ఇవ్వాలి. ప్రతిసారీ వైభవ్ గురించి చర్చ వచ్చినప్పుడు సంజునే ఎందుకు తప్పించాలనే ప్రశ్న వస్తోంది. వైభవ్‌ను ఆడించాలనుకుంటే అభిషేక్‌కు బ్రేక్ ఇవ్వొచ్చు. ఇక్కడ కీలకమైన పదం ‘విశ్రాంతి’. ఈ మ్యాచ్‌లో నేను అక్షర్ పటేల్‌ను కొనసాగిస్తాను. ఒక పేసర్‌కు విశ్రాంతి ఇచ్చి మయాంక్, ప్రిన్స్‌లకు అవకాశం కల్పిస్తాను. అర్ష్‌దీప్ సింగ్ ఈ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికి విశ్రాంతి ఇచ్చి పరిస్థితులకు అనుగుణంగా స్పిన్నర్లు ఎలా రాణిస్తారో చూడటంలో తప్పులేదు’ అని కార్తీక్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య

పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!

Updated Date - Oct 31 , 2026 | 02:03 PM