న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్: ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ఆకిబ్ నబీకి ఛాన్స్
ABN , Publish Date - Oct 31 , 2026 | 11:32 AM
న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జమ్మూ కశ్మీర్ సంచలనం ఆకిబ్ నబీకి బీసీసీఐ అవకాశం కల్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జమ్మూ కశ్మీర్ సంచలనం ఆకిబ్ నబీకి బీసీసీఐ అవకాశం కల్పించింది. కాగా నవంబర్ 4 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్లు ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి. తొలుత చివరి రెండు వన్డేల కోసం మాత్రమే ఎంపికైన నబీ.. తాజా పరిణామాలతో తొలి మూడు వన్డే మ్యాచ్‌ల్లో కూడా ఆడనున్నాడు. కాగా ఈ సిరీస్‌లో భారత్ రెండు వేర్వేరు జట్లతో బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.
వెస్టిండీస్‌తో గువాహటిలో జరిగిన రెండో వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ గాయపడ్డాడు. అయితే ఫిట్‌నెస్‌కు లోబడి భారత వన్డే జట్టులో ప్రసిద్ధ్‌కు చోటు కల్పించారు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు అతడిని దూరంగా ఉంచాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. రానున్న టెస్టు సిరీస్‌కు అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పేస్ బాధ్యతలు తీసుకునేదెవరు?
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత పేస్ విభాగం కొంత అనుభవలేమితో కనిపిస్తోంది. అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీకి అంతర్జాతీయ స్థాయిలో పరిమిత అనుభవమే ఉంది. మహ్మద్ సిరాజ్ మాత్రమే 50కి పైగా వన్డేలు ఆడిన ప్రధాన పేసర్‌గా జట్టులో ఉన్నాడు. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. దీంతో పేస్ బాధ్యతలు తీసుకునేదెవరనే చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!