Share News

ఫిఫా ఫైనల్.. అర్జెంటీనాను స్పెయిన్‌ ఓడిస్తుంది: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం

ABN , Publish Date - Jul 19 , 2026 | 04:47 PM

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంటుందని అతడు జోస్యం చెప్పాడు.

ఫిఫా ఫైనల్.. అర్జెంటీనాను స్పెయిన్‌ ఓడిస్తుంది: బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం
Ronaldo Nazario

ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, స్పెయిన్ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డో నజారియో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంటుందని అతడు జోస్యం చెప్పాడు. టోర్నీ మొత్తం స్పెయిన్ ఆధిపత్య ఆటతీరును ప్రదర్శించిందని, ఫైనల్‌లోనూ అలాగే ఆడి గెలుస్తుందని అభిప్రాయపడ్డాడు.


‘నా అంచనా ప్రకారం ఫిఫా ప్రపంచ కప్ 2026 స్పెయిన్ గెలుస్తుంది. అది కూడా సునాయసంగా విజయం సాధించే అవకాశం ఉంది. నాకు మొదటి నుంచి ఫ్రాన్స్, స్పెయిన్ జట్లే టైటిల్ ఫేవరెట్లు. స్పెయిన్ ఒకటి లేదా రెండు గోల్స్ ఆధిక్యంలోకి వెళ్తే అర్జెంటీనా తిరిగి పుంజుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే బంతిపై ఆధిపత్యం మొత్తం స్పెయిన్ చేతుల్లోనే ఉంటుంది’ అని రొనాల్డో విశ్లేషించాడు.


అర్జెంటీనా చరిత్ర సృష్టిస్తుందా?

డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఈసారి కూడా ఫైనల్‌లో విజయం సాధిస్తే వరుసగా రెండు ప్రపంచ కప్‌లు గెలిచిన రెండో జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 1962లో బ్రెజిల్ తొలిసారిగా ఈ ఘనత సాధించింది. మరోవైపు స్పెయిన్ మాత్రం టోర్నీలో అద్భుతమైన డిఫెన్స్‌తో ఆకట్టుకుంది. గత ఏడు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకోవడం విశేషం.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో మూడో వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆటకు బుమ్రా దూరం

ఫిఫా ఫైనల్‌కు ముందు మెస్సి ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. ఆటకు వీడ్కోలు పలుకనున్నాడా?

Updated Date - Jul 19 , 2026 | 05:04 PM