Share News

భారత్‌తో మూడో వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆటకు బుమ్రా దూరం

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:12 PM

ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు చివరి వన్డేలో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.

భారత్‌తో మూడో వన్డే: టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. ఆటకు బుమ్రా దూరం
India vs England

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్లు చివరి వన్డేలో తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది. గాయం కారణంగా స్టార్ బౌలర్ బుమ్రా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి ప్లేస్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన కేఎల్ రాహుల్ తిరిగొచ్చాడు. అదనంగా ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. అయితే 1-1 తేడాతో సమంగా నిలిచిగా ఇరుజట్లకు.. ఈ పోరు అత్యంత కీలకం కానుంది. టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. ఈ మ్యాచ్ గెలిచి వన్డే సిరీస్‌ను పట్టేయాలని చూస్తోంది.


ఇంగ్లండ్ తుది జట్టు:

హ్యారీ బ్రూక్(కెప్టెన్), బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), శామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

భారత్ తుది జట్టు:

శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ


ఇవి కూడా చదవండి:

టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచనలు చేసిన బీసీసీఐ

జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు రికార్డు!

Updated Date - Jul 19 , 2026 | 03:12 PM