Share News

రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు? కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!

ABN , Publish Date - Nov 11 , 2026 | 04:16 PM

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిపోవడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. ఈ విషయంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందించింది. ఎంఐ కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చింది.

రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు? కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
Mumbai Indians captain 2027

ఇంటర్నెట్ డెస్క్: స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిపోవడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. రెండు సీజన్లుగా ఎంఐకు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ట్రేడ్‌లో భాగంగా హార్దిక్ పంజాబ్‌కు వెళ్లగా, అర్ష్‌దీప్ సింగ్ ముంబై జట్టులోకి వచ్చాడు. దీంతో తిరిగి ఎంఐ సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకే తిరిగి జట్టు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం మొదలైంది. అతడితో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ స్పందించింది. ఎంఐ కెప్టెన్సీపై క్లారిటీ ఇచ్చింది.


‘ఎంఐ కెప్టెన్సీ విషయంలో ఇప్పుడే తొందరపడి నిర్ణయాలు తీసుకోం. రాబోయే సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్సీ ఎంపిక విషయంలో ముంబై ఇండియన్స్ ఆచితూచి వ్యవహరిస్తుంది. సరైన సమయంలో జట్టు కెప్టెన్సీపై అధికారిక ప్రకటన చేస్తాం’ అని ఫ్రాంచైజీ తెలిపింది. ఈ ప్రకటనతో రోహిత్ శర్మ మళ్లీ ముంబై పగ్గాలు చేపడతాడా? లేక మరో ఆటగాడికి అవకాశం దక్కుతుందా? అన్న ఉత్కంఠ పెరిగింది. నవంబర్ 17న ముగియనున్న ఆటగాళ్ల రిటెన్షన్ గడువు, డిసెంబర్ 16న గోవాలో నిర్వహించనున్న మినీ వేలానికి ముందు కెప్టెన్సీ అంశం కీలకంగా మారనుంది.


ఇవి కూడా చదవండి:

హార్దిక్-అర్ష్‌దీప్ ట్రేడ్.. ఎంఐ మరింత బలంగా మారింది: ఇర్ఫాన్ పఠాన్

క్రీజులో ‘సీతారామ్’ అని జపిస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటా: ఆర్యవీర్ సెహ్వాగ్

Updated Date - Nov 11 , 2026 | 04:17 PM