Share News

క్రీజులో ‘సీతారామ్’ అని జపిస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటా: ఆర్యవీర్ సెహ్వాగ్

ABN , Publish Date - Nov 11 , 2026 | 02:49 PM

క్రికెట్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఒత్తిడిని అధిగమించేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్.. క్రీజులో ఉన్నంత సేపు ‘సీతారామ్’ అని జపిస్తానని వెల్లడించాడు.

క్రీజులో ‘సీతారామ్’ అని జపిస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటా: ఆర్యవీర్ సెహ్వాగ్
Aryavir Sehwag

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఒత్తిడిని అధిగమించేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తుంటారు. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అయితే క్రీజులో ఉన్నప్పుడు పాటలు హమ్ చేస్తూ ప్రశాంతంగా ఉండేవాడు. కానీ ఆయన తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నంతసేపూ మనసులో ‘సీతారామ్’ నామాన్ని జపిస్తూ ఏకాగ్రతను పెంచుకుంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్యవీర్ వెల్లడించాడు. అండర్ 19 ఆసియా కప్ 2026లో యూఏఈపై జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్.. 160 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.


నాన్న అంత ఈజీగా ప్రశంసించరు!

‘ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిన తర్వాత నాన్న నుంచి ‘వెల్ ప్లేయ్‌డ్’ అంటూ మెసేజ్ వస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను సెంచరీ చేసినా సరే నాన్న పెద్దగా ప్రశంసించరు. అందుకే ఆయన నుంచి వచ్చే చిన్న ప్రశంస కూడా నాకు ఎంతో విలువైనది. మా అమ్మ మాత్రం భావోద్వేగాలను బాగా వ్యక్తపరుస్తారు. ఈ ఇన్నింగ్స్‌తో నా తల్లిదండ్రులిద్దరూ సంతోషపడ్డారని అనుకుంటున్నా. భవిష్యత్తులో మరిన్ని సెంచరీలు సాధించాలి. జట్టుకు మరిన్ని విజయాలు అందించాలి. సీనియర్ భారత జట్టులో చోటు సంపాదించి టీమిండియా జెర్సీ ధరించడమే నా కల. సీనియర్ జట్టులోకి ఎంపికై భారత జట్టు బ్యాడ్జ్ ధరించిన రోజునైనా మా నాన్న నన్ను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారని ఆశిస్తున్నా’ అని ఆర్యవీర్ తన మనసులో మాట వ్యక్తపరిచాడు.


ఇవి కూడా చదవండి:

టీమిండియా మాజీ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సంచలన నిర్ణయం!

ఐపీఎల్ 2027లో భారీ ట్రేడ్ డీల్.. ముంబైకి అర్ష్‌దీప్, పంజాబ్‌కు పాండ్యా!

Updated Date - Nov 11 , 2026 | 03:05 PM