Share News

టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:50 PM

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా
Ravindra Jadeja 350 wickets

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. మూడో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో కేశర నువాంతను ఔట్ చేసి ఈ అరుదైన క్లబ్‌లో చేరాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా జడ్డూ రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే(619 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్(537), కపిల్ దేవ్(434), హర్భజన్ సింగ్(417) ఈ జాబితాలో ఉన్నారు.


దీంతో పాటు, టెస్టు క్రికెట్ చరిత్రలో 4 వేలకు పైగా పరుగులు, 350 వికెట్లు పడగొట్టిన నాలుగో ప్లేయర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్(5,248 పరుగులు, 434 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డానియల్ వెటోరి(4,531 పరుగులు, 362 వికెట్లు), ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోతమ్(5200 పరుగులు, 383 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. టెస్టుల్లో 4 వేలకుపైగా పరుగులు, 350కి పైగా వికెట్లు తీసిన భారత ప్లేయర్లలో ఇప్పటి వరకు కపిల్ దేవ్ మాత్రమే ఉండటం విశేషం. ఇప్పుడు అతడి సరసన జడేజా వచ్చి చేరాడు.


ఇవి కూడా చదవండి:

గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే?

శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?

Updated Date - Aug 17 , 2026 | 05:50 PM