శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?
ABN , Publish Date - Aug 17 , 2026 | 02:31 PM
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. మూడో రోజు కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో(16.1 ఓవర్) కమిందు మెండిస్(14) ఇచ్చిన క్యాచ్‌ను గిల్ ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. మూడో రోజు కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో(16.1 ఓవర్) కమిందు మెండిస్(14) ఇచ్చిన క్యాచ్‌ను గిల్ ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుల్‌దీప్ యాదవ్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని మెండిస్ ముందుకొచ్చి డ్రైవ్ ఆడబోయాడు. బంతి గాల్లోకి లేచి దూరంగా వెళ్తున్నట్లే కనిపించింది. కానీ అక్కడే కాచుకుని ఉన్న గిల్ బంతి నేలకు తాకడానికి క్షణం ముందు ఒంటిచేత్తో ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.
అత్యుత్తమ క్యాచ్: సంజయ్ మంజ్రేకర్
ఈ క్యాచ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ప్రశంసలు కురిపించాడు. ‘వావ్.. ఇది అసాధ్యం. ఇలాంటి క్యాచ్‌ను గిల్ ఎలా పట్టాడో అర్థం కావడం లేదు. అది అతడి పరిధిలో ఉన్న బంతే కాదు. బ్యాటర్ కూడా ఆ బౌల్ తనకు దూరంగా వెళ్లిపోయిందని భావించి ఉంటాడు. గాలేలో మీరు చూసిన అత్యుత్తమ క్యాచ్‌ల్లో ఇదొకటి’ అని మంజ్రేకర్ వెల్లడించాడు.
మ్యాచ్ విషయానికొస్తే..
460/9 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో రెండు పరుగులు జోడించి 462 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. స్వల్ప వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడిన లంకను.. నిరోషాన్ డిక్వెల్లా(54*), సోనాల్ దినుశా(51*) కాస్త గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మానవ్ సుతార్ 2, సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, జడేజా తలొక వికెట్ తీశారు. ఈ వార్త రాసే సమయానికి భారత్ కంటే శ్రీలంక ఇంకా 277 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇవి కూడా చదవండి:
అరంగేట్ర మ్యాచ్‌లోనే శ్రీలంక బౌలర్ చెత్త రికార్డు
ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. స్కోర్ ఎంతంటే