IND vs SL: అరంగేట్ర మ్యాచ్‌లోనే శ్రీలంక బౌలర్ చెత్త రికార్డు
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:44 AM
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక డెబ్యూ బౌలర్ కేశరా నువాంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. డెబ్యూ టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా నువాంత నిలిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా 462 పరుగులకే అలౌటైంది. ఓవర్ నైట్ స్కోరుకు అదనంగా రెండు పరుగులను మాత్రమే జోడించింది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక డెబ్యూ బౌలర్ కేశర నువాంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు ఇచ్చిన నాలుగో బౌలర్‌గా కేశర నిలిచాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లు వేసిన నువాంత 3 వికెట్లు తీసి 175 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక శ్రీలంక తరఫున టెస్టు ఫార్మట్ డెబ్యూ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా సూరజ్ రన్‌దివ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2010లో కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 ఓవర్లు వేసిన సూరజ్ రికార్డు స్థాయిలో 222 పరుగులు ఇచ్చాడు. అలానే 2025లో గాలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో తరిందు రత్ననాయకే 196 పరుగులు(49.2 ఓవర్లు) ఇచ్చి రెండో స్థానంలో ఉన్నాడు.
1999లో ఢాకా వేదికగా పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్‌లో ఉపుల్ చందన 179 పరుగులు(47.5 ఓవర్లు) ఇచ్చి మూడో స్థానంలో ఉన్నాడు. తాజాగా కేశర్ 175 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచాడు. 2020లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో వనిందు హసరంగ 171 పరుగులు సమర్పించుకుని ఐదో స్థానంలో నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
నా ఫుట్‌బాల్ కెరీర్‌కు వచ్చే ఏడాదే చివరిది కావచ్చు: రొనాల్డో
పడిక్కల్ ఒక అరుదైన బ్యాటర్.. ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం