రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:34 AM
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అప్ప జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో బండ వికాస్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
రంగారెడ్డి, ఆగస్టు 17: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న(ఆదివారం) రాత్రి అప్ప జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో బండ వికాస్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
జగిత్యాల ప్రాంతానికి చెందిన వికాస్.. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మృతుడు హైదరాబాద్‌లోని సన్‌సిటీలో మిత్రులతో కలిసి నివాసం ఉంటున్నాడు. రాత్రి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వికాస్... ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో పనులపై ఎమ్మెల్యేల ప్రశ్నలు.. మంత్రి నారాయణ సమాధానం
ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం
Read Latest Telangana News And Telugu News