టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం
ABN , Publish Date - Aug 17 , 2026 | 05:12 PM
గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.
ఇంటర్నెట్ డెస్క్: గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. రవీంద్ర జడేజా 3, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ యాదవ్ తలొక వికెట్ పడగొట్టారు. శ్రీలంకపై భారత్ ఇంకా 178 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకు ముందు 460/9 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. నిషాన్ ఫెర్నాండో(0), లాహీరు ఉదారా(27), దినేశ్ చండిమాల్(4), కమిందు మెండిస్(14), ధనంజయ డిసెల్వా(21) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. పీకల్లోతు కష్టాల్లో పడిన లంకను సోనాల్ దినుశా, డిక్వెల్లా గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. ఆ తర్వాత కేశారా నువాంత(2), ప్రభాత్ జయసూర్య(10), లాహిరు కుమార(10) వరుసగా ఔటయ్యారు.
ఇవి కూడా చదవండి:
గంగూలీ కెప్టెన్సీకే ఎసరు పెట్టిన భారత ప్లేయర్లు.. అసలేం జరిగిందంటే?
శుభ్‌మన్ గిల్ సింగిల్ హ్యాండ్ క్రేజీ క్యాచ్.. వీడియో చూశారా?