Share News

కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు వస్తే ఆపడం చాలా కష్టం: రవిచంద్రన్ అశ్విన్

ABN , Publish Date - May 09 , 2026 | 06:35 PM

ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ దశలో మరో 19 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే జట్ల గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు.

కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు వస్తే ఆపడం చాలా  కష్టం: రవిచంద్రన్ అశ్విన్
Ravichandran Ashwin

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ దశలో మరో 19 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు. ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం జట్లు గట్టిపోటీనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే జట్ల గురించి టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడాడు. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్స్ రేసులోకి రావడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


‘ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకునేలా కనిపించడం లేదు. కేకేఆర్ కూడా ఈ రేసులో వెనుకబడిపోతుందని అనుకుంటున్నాను. ఒకవేళ కోల్‌కతా అర్హత సాధిస్తే ఆ జట్టును ఆపడం చాలా కష్టం. టోర్నీ ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన కేకేఆర్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. ఇతర జట్లకు గట్టి పోటినిస్తోంది. ప్లేయర్లు అద్భుత ప్రదర్శనలు చేయడం వల్లే గతంలో కేకేఆర్ మూడు టైటిళ్లను సాధించింది. లీగ్ దశ ముగిసి సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ టాప్ 2లో నిలుస్తాయని అనుకుంటున్నా. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌లలో ఏవైనా రెండు జట్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు రావాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లో మూడు గెలవాలి. లఖ్‌నవూతో జరగనున్న రెండు మ్యాచుల్లో సీఎస్కే విజయం సాధిస్తే కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరుతుంది’ అని అశ్విన్ విశ్లేషించాడు.


ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పదింట్లో నాలుగు గెలిచిన కేకేఆర్ ఏడో స్థానంలో ఉంది. కాగా ఎంఐ, లఖ్‌నవూ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే! ఆ రెండు జట్లు పట్టికలో అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని

ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి

Updated Date - May 09 , 2026 | 06:35 PM