Share News

రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని

ABN , Publish Date - May 09 , 2026 | 01:14 PM

టీమిండియా స్టార్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. రోహిత్ అభివాదం చేస్తుండగా.. ఇద్దరు అభిమానులు అతని చేతి గడియారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు.

రోహిత్ శర్మ వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిన అభిమాని
Rohit Sharma incident

స్పోర్ట్స్ డెస్క్: సెలబ్రిటీలు కనిపిస్తే సెల్ఫీ దిగేందుకు అభిమానులు, జనం ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు ప్రముఖులు సెల్ఫీలు, షేక్ హ్యాండ్ ఇస్తూ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. సెలబ్రిటీల వస్తువులు చోరీకి గురికావడం, హీరోయిన్ పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరిగాయి. తాజాగా టీమిండియా దిగ్గజం, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మకు కూడా చేదు అనుభవం ఎదురైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


రోహిత్ శర్మ తన కారులో కూర్చుని అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. కొందరు రోహిత్ నుంచి షేక్ హ్యాండ్ తీసుకోగా మరికొందరు ఫొటొ దిగారు. ఈ క్రమంలోనే ఇద్దరు అభిమానులు కారులో నుంచి అభివాదం చేస్తున్న రోహిత్ శర్మ చేతి గడియారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన రోహిత్ తన చేయిని లోపలికి లాక్కొని వారిని మందలిస్తూ అద్దాలు మూసివేశాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హిట్‌మ్యాన్ ధరించిన ఆ చేతి గడియారం ‘రోలెక్స్ జిరాఫ్‌’ బ్రాండ్‌దని, దాని విలువ దాదాపు రూ.3.25 కోట్లు ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.


ఇక, రోహిత్ శర్మ క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. లఖ్‌నవూతో జరిగిన గత మ్యాచ్‌లో ఈ ముంబై బ్యాటర్ 44 బంతుల్లో 84 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకున్నా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మెరుగైన ప్రదర్శన చేయట్లేదు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి మూడింట మాత్రమే విజయం సాధించింది. మే 10న రాయ్‌పుర్‌ వేదికగా బెంగళూరుతో ముంబై తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!

చరిత్ర సృష్టించిన ఫిన్ అలెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!

Updated Date - May 09 , 2026 | 01:20 PM