రాష్ట్ర క్రీడా మంత్రిగా కేకేఆర్ మాజీ ఆటగాడు!
ABN , Publish Date - May 09 , 2026 | 11:21 AM
టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరిన క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో గెలిచి బీజేపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి ఎంట్రీ సత్తాచాటుతున్నారు. అంతేకాక ప్రజాప్రతినిధులుగా ఎన్నికై.. వివిధ పదవులను చేపట్టారు. తాజాగా ఆ జాబితాలో కోల్‌కతా నైట్ రైడర్ మాజీ ప్లేయర్ చేరారు. పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో మంత్రిగా నియమితులయ్యారు. మరి.. ఆయన ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
టీమిండియా మాజీ క్రికెటర్, కేకేఆర్ మాజీ బౌలర్ అశోక్ దిండా పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరిన క్రీడా మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 294కు గానూ 206 స్థానాల్లో గెలిచి బీజేపీ విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. అశోక్ దిండా మోయ్నా నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఎంసీ అభ్యర్ది చందన్ మొండల్‌పై 14 వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. గత ఎన్నికల్లో (2021) స్వల్ప తేడాతో విజయం సాధించిన దిండా, ఈసారి భారీ ఆధిక్యంతో విజయం సాధించి సువేందు అధికారి సర్కార్‌లో క్రీడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
2021లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలిన దిండా.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. దిండా అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన స్థాయిలో రాణించలేపోయినా... దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించారు. బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 420 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్‌లో 151 వికెట్లు పడగొట్టారు. దిండా బెంగాల్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. 2009లో టీమిండియా అరంగేట్రం చేసి 13 వన్డేలు, 9 టీ20లు ఆడి 29 వికెట్లు తీశారు. అలానే ఐపీఎల్‌లో కేకేఆర్, ఆర్సీబీ, ఢిల్లీ, పూణే వారియర్స్, రైజింగ్ పూణే జెయింట్స్ తరఫున 78 మ్యాచ్‌లు ఆడిన దిండా 69 వికెట్లు తీశారు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ఫిన్ అలెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!