టీవీకే విడుదల చేసిన వీడియోపై స్పందించిన దినకరన్
ABN , Publish Date - May 09 , 2026 | 12:49 PM
టీవీకే పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్ వీడియోపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధినేత దినకరన్ స్పందించారు. టీవీకే విడుదల చేసిన వీడియోపై అనుమానాలున్నాయని అన్నారు.
చెన్నై, మే 9: టీవీకే పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్ వీడియోపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ అధినేత దినకరన్ స్పందించారు. టీవీకే విడుదల చేసిన వీడియోపై అనుమానాలున్నాయని అన్నారు. మొత్తం వీడియోను ఎందుకు రిలీజ్ చేయటం లేదని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యే లేఖను ఫోర్జరీ చేశారని ఆరోపించారు. టీవీకే పార్టీ విడుదల చేసిన లేఖ తమది కాదన్నారు. కామరాజు పేరుతో ఫేక్ లెటర్‌ను గవర్నర్‌కు ఇచ్చారన్నారు. లేఖపై కామరాజు సంతకం పెట్టే వీడియోను ఎవరు ఎప్పుడు తీశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
వీడియో ఒరిజినల్ కాదన్న అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం వీడియోను టీవీకే ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఫోర్జరీ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, శుక్రవారం అర్థరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ మద్దతు లేఖను విజయ్ గవర్నర్‌కు అందించటంపై టీటీవీ దినకరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్ అందుబాటులో లేరని, ఆయనను అపహరించి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. అర్థరాత్రి గవర్నర్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు.
వీసీకే చీఫ్ తిరుమావళవన్‌తో విజయ్ భేటీ
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతు కోరుతూ టీవీకే చీఫ్ విజయ్ వీసీకే చీఫ్ తిరుమావళవన్‌తో భేటీ అవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీసీకే పార్టీకి చెందిన రెండు సీట్లు కీలకంగా మారాయి. వీసీకే మద్దతు ఇస్తే విజయ్ సీఎం అవ్వడానికి మార్గం సుగమం అవ్వనుంది.
ఇవి కూడా చదవండి
టీమిండియా టీ20 కెప్టెన్‌గా సంజు శాంసన్!