Share News

ఒత్తిడిని తట్టుకుని ఆడితేనే కివీస్‌పై భారత్ గెలవగలదు: రవి శాస్త్రి

ABN , Publish Date - Oct 21 , 2026 | 09:49 PM

భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఒత్తిడిని తట్టుకుని ఆడితేనే కివీస్‌పై భారత్ గెలవగలదు: రవి శాస్త్రి
Ravi Shastri

ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. అక్కడ ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్‌ గడ్డపై ఆ జట్టును ఓడించాలంటే భారత జట్టు పేరుప్రఖ్యాతులు మాత్రమే సరిపోవని తెలిపాడు. ప్రత్యర్థి నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకుని, అదే ఒత్తిడిని న్యూజిలాండ్‌పైకి మళ్లించాలని సూచించాడు.


‘న్యూజిలాండ్‌ జట్టు భారత్‌పై గట్టిగా పోరాడుతుంది. అక్కడి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంటుంది. ప్రతి విజయానికీ ప్రత్యర్థి కష్టపడేలా చేస్తారు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. కానీ గతంలో సాధించిన పేరుప్రతిష్ఠలు ఈ సిరీస్‌లో విజయాన్ని అందించవు. ఒత్తిడిని తట్టుకుని, తిరిగి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలి. తొలి టీ20 నుంచే భారత్‌ ఎలా ఆడుతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రవిశాస్త్రి తెలిపాడు.


టెస్టుల్లో గెలిస్తేనే..

భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్‌ అజింక్య రహానె కూడా ఈ విషయంపై మాట్లాడాడు. ‘2027 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలంటే న్యూజిలాండ్‌పై భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. న్యూజిలాండ్‌ పరిస్థితుల్లో భారత బ్యాటర్లకు కఠిన పరీక్ష ఎదురవుతుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అనుభవం ఉపయోగపడుతుంది. వరుసగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో జట్టు రిజర్వ్‌ ఆటగాళ్ల సామర్థ్యానికీ పరీక్ష ఎదురవుతుంది. ప్రతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి.. ముందస్తు అంచనాలతో ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికలకు అనుగుణంగా ఆడాలి’ అని రహానె సూచించాడు.


ఇవి కూడా చదవండి:

మూడు ఫార్మాట్లలో ఆడుతా.. నాపై ఆ ముద్ర వేయకండి: ప్రియాంశ్ ఆర్య

ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అమిత్ మిశ్రా.. గంగూలీ, యువీలతో పాటు..!

Updated Date - Oct 21 , 2026 | 09:49 PM