ఐపీఎల్ 2026: రాణించిన ఆర్ఆర్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - May 24 , 2026 | 05:44 PM
ఐపీఎల్ 2026లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(27), వైభవ్ సూర్యవంశీ(4) కీలక మ్యాచ్‌లో విఫలమయ్యారు.
ధ్రువ్ జురెల్(38; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు జట్టును నడిపించాడు. రియాన్ పరాగ్(14), ఫెర్రీరా(18), శుభమ్ దూబె(5) నిరాశపర్చారు. డాసున్ శనక(29; 15 బంతుల్లో 3 సిక్స్‌లు) క్రీజులో ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. జోఫ్రా ఆర్చర్(32; 15 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అతడి వల్లే ఆఖరిలో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రవీంద్ర జడేజా(19*; 11 బంతుల్లో3 ఫోర్లు), బర్గర్(10*) నాటౌట్‌గా నిలిచారు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ 2, శార్దూల్ ఠాకూర్ 2, విల్ జాక్స్ 1, ఘజన్‌ఫర్ 1, బాష్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత