Share News

బుమ్రాకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో రామ్‌చరణ్

ABN , Publish Date - May 24 , 2026 | 04:45 PM

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా వస్తోన్న ‘పెద్ది’ మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం భోపాల్‌లో శనివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో జరిగిన చిన్న పొరపాటుపై చరణ్ స్పందిస్తూ.. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.

బుమ్రాకు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో రామ్‌చరణ్
Ram Charan, Jasprit Bumrah

ఇంటర్నెట్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా వస్తోన్న ‘పెద్ది’ మూవీ మ్యూజిక్ లాంచ్ కార్యక్రమం భోపాల్‌లో శనివారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో హీరో రామ్‌చరణ్ చేసిన ఓ పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేదికపై క్రికెటర్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ హాస్ట్ ర్యాపిడ్ ఫైర్ నిర్వహించారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ కాస్త తడబడ్డారు. టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాకు తాను అభిమానినంటూ వెల్లడించి.. ఆ తర్వాత బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొన్నారు. దీంతో చరణ్‌పై మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ బుమ్రాకు క్షమాపణలు చెప్పారు.


‘నేను కొన్నిసార్లు పేర్లను మర్చిపోతుంటాను. జన సందోహం, అభిమానుల సందడి మధ్య అనుకోకుండా పొరపాటు జరిగింది. బుమ్రాకు క్షమాపణలు చెబుతున్నా. బుమ్రాపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఆటకు నేను పెద్ద అభిమానిని. తన అద్భుత ప్రదర్శనలతో ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తున్నారు’ అని చరణ్ పేర్కొన్నాడు. కాగా ‘పెద్ది’ ఈవెంట్‌కు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, హీరోయిన్ జాన్వీ కపూర్‌తో పాటు చిత్ర బృందం హాజరైంది. అయితే సినిమా ప్రమోషన్స్ కంటే రామ్ చరణ్ చేసిన ఈ పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో అరుదైన ఫీట్.. కోహ్లీ, సెహ్వాగ్ సరసన శ్రేయస్ అయ్యర్

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. పంజాబ్ ఓపెనర్ అరుదైన ఘనత

Updated Date - May 24 , 2026 | 04:54 PM