ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కీలక మ్యాచ్.. టాస్ నెగ్గిన ముంబై
ABN , Publish Date - May 24 , 2026 | 03:15 PM
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ముంబై.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ముంబై.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే ఇరు జట్లకు ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. ఈ పోరులో రాజస్థాన్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ముంబైపై విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్‌కు చేరకుంటుంది. రాజస్థాన్ ఓడితే.. ఆ జట్టుతో పాటు పంజాబ్ కూడా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఆర్ఆర్ గెలిస్తే.. నేడు జరిగే కేకేఆర్-ఢిల్లీ మ్యాచ్ నామమాత్రంగానే మిగిలిపోనుంది. దీంతో రాజస్థాన్ గెలుచి ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందా? ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించి వేరే జట్లకు అవకాశం ఇస్తుందా? చూడాల్సి ఉంది.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు
రియాన్ పరాగ్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), డొనొవాన్ ఫెర్రీరా, శుభమ్ దూబె, డాసున్ శనక, ఆర్చర్, బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేశ్ శర్మ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రవీంద్ర జడేజా, సుశాంత్ మిశ్రా, అమన్ రావ్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే
ముంబై ఇండియన్స్ తుది జట్టు
హార్దిక్ పాండ్య(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, బోష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఘజన్‌ఫర్, రఘు శర్మ
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రోహిత్ శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, క్రిష్ భగత్, బౌల్ట్
ఇవి కూడా చదవండి:
అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్
ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..