Share News

ఐపీఎల్ 2026: ప్రియాంశ్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?

ABN , Publish Date - May 11 , 2026 | 09:34 PM

ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఢిల్లీకి 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: ప్రియాంశ్, శ్రేయస్ హాఫ్ సెంచరీలు.. ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ ఎంతంటే?
PBKS vs DC

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఢిల్లీకి 211 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(56; 33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(59*; 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.


ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్(18), ప్రియాంశ్ ఆర్య(56) ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించారు. 2.4 ఓవర్లలోనే వీరిద్దరూ జట్టుకు 50 పరుగులు జోడించారు. దీంతో ఫాస్టెస్ట్ 50 చేసిన జట్టుగా పంజాబ్ చరిత్ర సృష్టించింది. కూపర్ కనోలి(38) రాణించాడు. స్టోయినిస్(1), శశాంక్ సింగ్(0) విఫలమయ్యారు. సూర్యాంశ్ షెడ్గె(21*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆఖరి దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 2, మాధవ్ తివారి 2, ముకేశ్ కుమార్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - May 11 , 2026 | 09:34 PM