ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్
ABN , Publish Date - May 11 , 2026 | 07:16 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. టోర్నీ ఆరంభంలో ఓటమే లేకుండా సాగిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా మూడు పరాజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో కాస్త వెనుకపడింది. మరోవైపు ఢిల్లీ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే. కానీ పట్టికలో దిగువన జట్లు అనూహ్యంగా పుంజుకుని ప్లే ఆఫ్స్ రేసులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడితే ఢిల్లీ ఎలిమినేట్ అవుతుంది. వరుస పరాజయాలతో కష్టాల్లో ఉన్న పంజాబ్.. ఈ మ్యాచ్‌లో పుంజుకుంటుందా? అనేది ఆసక్తిగా మారింది.
పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాంశ్ ఆర్య, కూపర్ కనోలీ, సుర్యాంశ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, యాన్సెన్, బెన్ డ్వార్షుయస్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: హర్‌ప్రీత్ బ్రార్, యశ్ ఠాకూర్, బార్ట్‌లెట్, విష్ణు వినోద్, ప్రవీణ్ దూబె
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
అక్షర్ పటేల్(కెప్టెన్), కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పొరెల్, సాహిల్ ఫరాఖ్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మాధవ్ తివారి, ముకేశ్ కుమార్, ఆకిబ్ నబీ దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: పాతుమ్ నిశాంక, సమీర్ రిజ్వి, అశుతోశ్ శర్మ, విప్రజ్ నిగమ్, త్రిపురన విజయ్
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్