ఐపీఎల్ 2026: ఫ్రాంచైజీ ఓనర్లకు బీసీసీఐ హెచ్చరిక!
ABN , Publish Date - May 11 , 2026 | 04:06 PM
ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ స్టేజ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల తీరుపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు జారీ చేసిన నిబంధనలను కొందరు జట్టు యజమానులు ఉల్లంఘిస్తున్నారని గుర్తించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. లీగ్ స్టేజ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ల తీరుపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డు జారీ చేసిన నిబంధనలను కొందరు జట్టు యజమానులు ఉల్లంఘిస్తున్నారని గుర్తించింది. ఇకపై రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇటీవలే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ప్రత్యేక మార్గదర్శకాలు పంపించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో జట్టు యజమానులు ప్లేయింగ్ ఏరియాలోకి రావొద్దని, ప్లేయర్లు లేదా సపోర్ట్ స్టాఫ్‌తో ప్రత్యక్షంగా మాట్లాడకూడదని స్పష్టం చేశారు. అయితే కొందరు ఓనర్లు ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదని బీసీసీఐ గుర్తించింది.
‘ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాం. డగౌట్ సమీపంలో యజమానులు తిరుగుతూ కనిపించారు. మరికొందరు మొబైల్ ఫోన్లతో మైదానంలోకి వచ్చి ఫొటోలు కూడా తీశారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. పలుమార్లు హెచ్చరించినా వారి తీరులో మార్పు రాలేదు. అందుకే ఇదే రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవు’ అని ఐపీఎల్‌కు సంబంధించిన అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఐపీఎల్ 2026 సీజన్‌లో ‘హనీ ట్రాప్’ ప్రమాదాలపై కూడా బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలను అప్రమత్తం చేసింది. ఆటగాళ్లు లేదా అధికారులపై లైంగిక వేధింపుల వంటి ఆరోపణలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. హై ప్రొఫైల్ క్రీడా వాతావరణాల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని, ప్రతి ఫ్రాంచైజీ అప్రమత్తంగా వ్యవహరించాలని దేవజిత్ సైకియా సూచించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ, ఐపీఎల్ ఆపరేషన్స్ సభ్యులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు హోటల్ గదుల్లో తనిఖీలు నిర్వహిస్తుంటాయి. అనుమతి లేని వ్యక్తులు.. ఆటగాళ్ల గదుల్లోకి ప్రవేశించినట్లు తేలితే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బీసీసీఐ హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?
భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్