Share News

ఐపీఎల్ 2026: నిశాంక హాఫ్ సెంచరీ.. కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం

ABN , Publish Date - May 08 , 2026 | 09:22 PM

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేశారు. కేకేఆర్‌కు 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఐపీఎల్ 2026: నిశాంక హాఫ్ సెంచరీ.. కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం
DC vs KKR

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేశారు. కేకేఆర్‌కు 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు. ఢిల్లీ ఓపెనర్ పాతుమ్ నిశాంక(50; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. అతడి వల్లే ఢిల్లీకి ఆ గౌరవప్రదమైన స్కోర్ లభించింది.


నిశాంక మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. ఆఖర్లో అశుతోశ్ శర్మ(39; 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడాడు. కేఎల్ రాహుల్(23), నితీశ్ రాణా(8), సమీర్ రిజ్వి(3), స్టబ్స్(2), అక్షర్ పటేల్(11), స్టార్క్(0) వెనువెంటనే ఔటై పెవిలియన్ చేరారు. విప్రజ్ నిగమ్(3*), లుంగి ఎంగిడి(1*) నాటౌట్‌గా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్ 2, కార్తిక్ త్యాగి 2, వైభవ్ అరోరా 1, సునీల్ నరైన్ 1, గ్రీన్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 08 , 2026 | 09:22 PM