Share News

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కోల్‌కతా నైట్‌రైడర్స్

ABN , Publish Date - May 08 , 2026 | 07:13 PM

ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన కోల్‌కతా నైట్‌రైడర్స్
KKR vs DC

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన కేకేఆర్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది. టోర్నీ ఆరంభంలో గెలుపు కోసం శ్రమించిన కేకేఆర్.. గత మూడు మ్యాచులుగా వరుస విజయాలతో జోరుమీదుంది. ఈ మ్యాచులోనూ గెలిచి తీరాలని రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. మరోవైపు, చెన్నైపై ఘోర పరాజయం పాలైన ఢిల్లీ.. ఈ మ్యాచ్‌లో గెలవాలనే కసితో ఉంది. అయితే పదింట్లో నాలుగు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. తొమ్మిందింట్లో మూడు గెలిచిన కేకేఆర్.. 8వ స్థానంలో కొనసాగుతోంది.


కేకేఆర్ తుది జట్టు

అజింక్య రహానె(కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, పొవెల్, మనీశ్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: రమన్‌దీప్ సింగ్, ఫిన్ అలెన్, తేజస్వి దాహియా, నవదీప్ సైని, టిమ్ సీఫర్ట్


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు:

అక్షర్ పటేల్(కెప్టెన్), పాతుమ్ నిశాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), నితీశ్ రానా, సమీర్ రిజ్వి, స్టబ్స్, అశుతోశ్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి, ముకేశ్ కుమార్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, అభిషేక్ పొరెల్, డేవిడ్ మిల్లర్


ఇవి కూడా చదవండి:

సోషల్ మీడియా వ్లాగింగ్ ఆపేయాలి.. అర్ష్‌దీప్ సింగ్‌ను కోరిన బీసీసీఐ!

ఆ నిబంధనను సవరించి పేసర్లకు వెసులుబాటు కల్పించాలి: సునీల్ గావస్కర్

Updated Date - May 08 , 2026 | 07:13 PM