భారత్‌తో హ్యాండ్‌షేక్ వివాదం: పాకిస్థాన్ కోచ్ రియాక్షన్ ఇదే
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:34 PM
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోనూ ఇరుజట్ల ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు. ఈ అంశంపై పాక్ కోచ్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోనూ ఇరుజట్ల ప్లేయర్లు హ్యాండ్‌షేక్ ఇచ్చుకోలేదు. టాస్ సమయంలో, మ్యాచ్ ముగిసిన తర్వాత ప్లేయర్లు హ్యాండ్‌షేక్ చేసుకోకపోవడంతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాకిస్థాన్ కోచ్ వహాబ్ రియాజ్‌కు ఈ అంశంపై ప్రశ్న ఎదురైంది.
మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ ఈ అంశాన్ని ప్రస్తావించాడు. ‘ఇది రాజకీయ అంశమని తెలిసినా అడుగుతున్నాను. ఇరు జట్ల ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి? మైదానం వెలుపల స్నేహపూర్వకంగా ఉంటున్నారా? లేక దూరంగానే ఉంటున్నారా? హ్యాండ్‌షేక్‌పై మీ అభిప్రాయం ఏంటి? అని ప్రశ్నించాడు. దీనికి వహాబ్ రియాజ్ సమాధానమిచ్చాడు. ‘హ్యాండ్‌షేక్ చేసుకోకపోవడానికి గల కారణాలు ఏమిటో నాకు తెలియదు. నేను చాలా కాలం క్రితమే క్రికెట్‌కు దూరమయ్యాను. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగాలనుకుంటే అలాగే కొనసాగనివ్వండి. హ్యాండ్‌షేక్ వల్ల పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు’ అని తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, భారత మహిళల జట్టు ఆది నుంచే ఆధిపత్యం చెలాయించి పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఛేదనలో పాకిస్థాన్ 106 పరుగులకే ఆలౌటైంది. భారత్ విజయంలో స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ కీలకపాత్ర పోషించింది. ఆమె 5 వికెట్లు పడగొట్టి పాకిస్థాన్ పతనాన్ని శాసించింది. అంతేకాదు, మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు (166) తీసిన బౌలర్‌గా కొత్త రికార్డు సృష్టించింది. మరో స్పిన్నర్ శ్రీచరణి 3 వికెట్లు తీసి అద్భుత సహకారం అందించింది.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్‌లో చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ
IND vs SL: మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ!