Share News

నవరాత్రి వేడుకల్లో ధోని సందడి.. అంబానీ ఫ్యామిలీతో కలిసి ఐస్‌క్రీమ్ తింటూ..!

ABN , Publish Date - Oct 19 , 2026 | 02:52 PM

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో ధోని, అతడి భార్య సాక్షి పాల్గొని సందడి చేశారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లతో కలిసి ధోని డ్రాగన్ బోట్ రైడ్ సహా పలు యాక్టివిటీస్‌లో పాల్గొన్నాడు.

నవరాత్రి వేడుకల్లో ధోని సందడి.. అంబానీ ఫ్యామిలీతో కలిసి ఐస్‌క్రీమ్ తింటూ..!
MS Dhoni Navratri celebrations

ఇంటర్నెట్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని.. ఏ పని చేసినా నెట్టింట ఇట్టే వైరల్ అవుతుంటుంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో ధోని, అతడి భార్య సాక్షి పాల్గొని సందడి చేశారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లతో కలిసి ధోని డ్రాగన్ బోట్ రైడ్ సహా పలు యాక్టివిటీస్‌లో పాల్గొన్నాడు. వారితో కలిసి ఐస్‌క్రీమ్ కూడా తిన్నాడు. రిలయన్స్ టౌన్‌షిప్‌లో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


ఈ వేడుకల్లో భాగంగా ధోని డ్రాగన్ బోట్ రైడ్‌లో పాల్గొన్నాడు. అందరూ అరుపులు, కేకలతో తెగ ఎంజాయ్ చేసేస్తుంటే.. ధోని మాత్రం గ్రౌండ్‌లో కూల్‌గా ఉన్నట్టే.. రైడ్‌లోనూ ఎలాంటి హావభావాలు పలికించకుండా ప్రశాంతంగా ఎంజాయ్ చేశాడు. ‘అందుకే ఇతడిని కెప్టెన్ కూల్ అంటారు’, ‘ధోని.. లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనుకుంటా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ధోని, సాక్షి ఈ ఈవెంట్‌లో పాల్గొన్నట్లు సమాచారం. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లతో కలిసి ఐస్‌క్రీమ్ కూడా తిన్నారు. గేమ్స్ ఆడుతూ.. అభిమానులతో ముచ్చటిస్తూ ధోని సరదాగా గడిపాడు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్‌లో అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో సంప్రదాయ సంగీతం, గర్బా నృత్యాలతో పాటు పలు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు క్రికెట్, వ్యాపార, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ధోనీ పాల్గొన్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూ అభిమానులను అలరిస్తున్నాయి.


ఇవీ చదవండి

సమరం..ఆరంభం

షఫాలీ దంచేసింది

Updated Date - Oct 19 , 2026 | 03:02 PM