Share News

దీరజ్‌ బృందానికి ఏపీఎల్‌ కిరీటం

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:50 AM

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-2 ట్రోఫీని విజయవాడ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ సారథ్యంలోని మైటీ మరాఠాస్‌...

దీరజ్‌ బృందానికి ఏపీఎల్‌ కిరీటం

ఫైనల్లో కాకతీయ నైట్స్‌పై మైటీ మరాఠాస్‌ గెలుపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌-2 ట్రోఫీని విజయవాడ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ సారథ్యంలోని మైటీ మరాఠాస్‌ కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో మరాఠాస్‌ 6-2తో ఆతిథ్య కాకతీయ నైట్స్‌పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన ఎలిమినేటర్‌-2లో మైటీ మరాఠాస్‌ 5-3తో పృథ్వీరాజ్‌ యోధా్‌సను ఓడించి టైటిల్‌ ఫైట్‌కు చేరుకుంది. ఇక, ఏపీఎల్‌ ఉత్తమ రికర్వ్‌ ఆర్చర్లుగా ధీరజ్‌, సంగీత, ఉత్తమ కాంపౌండ్‌ ఆర్చర్లుగా ఫుల్లర్టన్‌, అలెజాండ్రా నిలిచారు. రాష్ట్ర క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఏపీఎల్‌ డైరెక్టర్‌ అనిల్‌ కామినేని, రాష్ట్ర ఆర్చరీ సంఘం చీఫ్‌ టి.రాజు ట్రోఫీలు ప్రదానం చేశారు.

ఇవి కూడా చదవండి:

విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు

న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా

Updated Date - Oct 19 , 2026 | 05:50 AM