Share News

షఫాలీ దంచేసింది

ABN , Publish Date - Oct 19 , 2026 | 05:56 AM

తొలి మ్యాచ్‌లో ఆశించిన రీతిలో ఆకట్టుకోని భారత మహిళల జట్టు ఈసారి కదం తొక్కింది. ముందుగా జింబాబ్వే బ్యాటర్లకు బౌలర్లు చుక్కలు చూపించగా.. అనంతరం ఓపెనర్లు షఫాలీ వర్మ 25 బంతుల్లో...

షఫాలీ దంచేసింది

24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ

  • రాణించిన మంధాన

  • రెండో టీ20లో జింబాబ్వేపై భారత్‌ ఘనవిజయం

అదరగొట్టిన బౌలర్లు జూమరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ కైవసం

రాయ్‌పూర్‌: తొలి మ్యాచ్‌లో ఆశించిన రీతిలో ఆకట్టుకోని భారత మహిళల జట్టు ఈసారి కదం తొక్కింది. ముందుగా జింబాబ్వే బ్యాటర్లకు బౌలర్లు చుక్కలు చూపించగా.. అనంతరం ఓపెనర్లు షఫాలీ వర్మ (25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 55), కెప్టెన్‌ స్మృతి మంధాన (25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 నాటౌట్‌) తమ బ్యాటింగ్‌ స్థాయి ఏంటో చూపారు. దీంతో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్‌ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ ఫార్మాట్‌లో భారత్‌కిది వరుసగా పదో విజయం కావడం విశేషం. అలాగే 2-0తో మరో మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. ఆఖరి మ్యాచ్‌ మంగళవారం జరుగుతుంది. ముందుగా జింబాబ్వే 20 ఓవర్లలో 8 వికెట్లకు 102 పరుగులు చేసింది. టిరిపానో (34), కెప్టెన్‌ నికోమో (27 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. నిక్కీ ప్రసాద్‌కు రెండు వికెట్లు లభించాయి. స్వల్ప ఛేదనలో భారత్‌ 8.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 104 పరుగులు చేసి గెలిచింది. బిజాకు ఓ వికెట్‌ దక్కింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా షఫాలీ నిలిచింది.

ఓపెనర్ల దూకుడు: స్వల్ప ఛేదన కోసం బరిలోకి దిగిన భారత మహిళలు ఈసారి బ్యాటింగ్‌లో అదరగొట్టారు. ఓపెనర్లు షఫాలీ, మంధాన బ్యాట్లు ఝుళిపించడంతో జింబాబ్వే బౌలర్లు బెదిరి పోయారు. తొలి టీ20లో నాలుగు ఓవర్లలోనే 4 వికెట్లు తీసిన బౌలర్లకు ఈసారి ఓపెనింగ్‌ ద్వయం షాక్‌ ఇచ్చింది. ఇన్నింగ్స్‌ మొదటి బంతినే ఫోర్‌గా మలిచిన షఫాలీ మూడో బంతిని సిక్సర్‌ బాదడంతో పరుగుల వేట ఆరంభమైంది. అటు మంధాన ఐదో ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు, షఫాలీ మరో ఫోర్‌తో 21 రన్స్‌ సమకూరాయి. తర్వాతి ఓవర్‌లో షఫాలీ 4,4,6 సాధించగా పవర్‌ప్లేలో జట్టు తమ రెండో అత్యధిక స్కోరు (76)ను సాధించింది. అదే ఊపులో ఓ సిక్సర్‌ ద్వారా 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసిన షఫాలీ ఆ వెంటనే బిజాకు చిక్కింది. దీంతో తొలి వికెట్‌కు 96 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిన భారత్‌.. మంధాన సిక్సర్‌తో 67 బంతులుండగానే లాంఛనాన్ని ముగించింది.


10-sports.jpg

బౌలర్ల హవా: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే ఇన్నింగ్స్‌ నెమ్మదిగా సాగింది. 30/3 స్కోరుతో కష్టాల్లో పడగా టిరిపానో, నికోమో నాలుగో వికెట్‌కు 45 రన్స్‌ జోడిం చారు. అయితే తొలిసారి బౌలింగ్‌కు దిగిన నిక్కీ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీయడం ఈ మ్యాచ్‌లో విశేషం.

స్కోరుబోర్డు

జింబాబ్వే: ఎన్‌ధ్లోవు (బి) నందని 0, బిజా (సి) హర్మన్‌ (బి) దీప్తి 7, టిరిపానో (సి) రిచా (బి) నిక్కీ 34, మేయర్స్‌ (సి) దీప్తి (బి) క్రాంతి 9, ఎన్‌కోమో (నాటౌట్‌) 27, గ్వాంజుర (ఎల్బీ) నిక్కీ 0, ముపచిక్వ (రనౌట్‌) 9, మవుంగ (సి) నిక్కీ (బి) శ్రీచరణి 4, చిపరె (రనౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 102/8. వికెట్ల పతనం: 1-10, 2-20, 3-30, 4-75, 5-75, 6-94, 7-99, 8-102. బౌలింగ్‌: క్రాంతి 4-0-15-1, నందని 3-0-17-1, దీప్తి 3-0-13-1, అరుంధతి 3-0-17-0, శ్రీచరణి 4-0-21-1, షఫాలీ 1-0-7-0, నిక్కీ 2-0-7-2.

భారత్‌: షఫాలీ (సి) మకుష (బి) బిజా 55, మంధాన (నాటౌట్‌) 47, అనుష్క (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 8.5 ఓవర్లలో 104/1. వికెట్ల పతనం: 1-96; బౌలింగ్‌: గ్వాంజుర 3-0-42-0, మకుష 2-0-19-0, మవుంగ 1-0-15-0, చారె 1.5-0-19-0, బిజా 1-0-9-1.

1

కెరీర్‌లో తన తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన ఏకైక భారత క్రికెటర్‌గా నిక్కీ ప్రసాద్‌. ఓవరాల్‌గా కాస్ర్పోవిజ్‌ (ఆస్ట్రేలియా), అక్షత రావ్‌ (యూఎస్‌ఏ) తర్వాతి స్థానంలో నిలిచింది.

1

ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో తమ కెరీర్‌లో అత్యధిక టీ20 విజయాలు (17) సాధించడం భారత మహిళల జట్టుకు ఇదే తొలిసారి. అలాగే ఒకే ఏడాదిలో ఎక్కువ హాఫ్‌ సెంచరీలు (9) బాదిన భారత మహిళా బ్యాటర్‌గా షఫాలీ వర్మ.

1

మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఎక్కువ బంతులుండగానే (67) 100+ ఛేదనను ముగించిన జట్టుగా భారత్‌.

ఇవి కూడా చదవండి:

విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు

న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా

Updated Date - Oct 19 , 2026 | 05:57 AM