సమరం..ఆరంభం
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:47 AM
పారా ఆసియా క్రీడల ఆరంభోత్సవం ఆదివారం ఇక్కడ ఘనంగా జరిగింది. స్ర్పింటర్ సిమ్రన్ శర్మ, స్టార్ షట్లర్ ప్రమోద్ భగత్ త్రివర్ణ పతకాన్ని ధరించి ముందునడవగా 100మందికిపైగా అథ్లెట్లతో కూడిన భారత...
మన ‘బ్లేజర్’పై సింధూ నాగరికత జిగేల్
నగోయ (జపాన్): పారా ఆసియా క్రీడల ఆరంభోత్సవం ఆదివారం ఇక్కడ ఘనంగా జరిగింది. స్ర్పింటర్ సిమ్రన్ శర్మ, స్టార్ షట్లర్ ప్రమోద్ భగత్ త్రివర్ణ పతకాన్ని ధరించి ముందునడవగా 100మందికిపైగా అథ్లెట్లతో కూడిన భారత బృందం మార్చ్‌పా్‌స్టలో పాల్గొంది. కార్యక్రమంలో మన అథ్లెట్లు ధరించిన బ్లేజర్లు చూపరులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఐదు వేల ఏళ్లనాటి భారత నాగరికత స్ఫూర్తిగా రూపొందించిన బ్లేజర్లు.. భారత్ ఘనమైన వారసత్వాన్ని కళ్లకు కట్టాయి. ‘మార్చ్‌పా్‌స్టలో భారత క్రీడాకారులు కేవలం వేడుకలకు సంబంధించిన దస్తులు ధరించలేదు. అవి ఐదు వేల ఏళ్ల నాగరికతకు ప్రతిబింబాలు. మన వారసత్వానికి ఆ బ్లేజర్లు నివాళి అర్పించాయి’ అని భారత పారాలింపిక్ కమిటీ పేర్కొంది. బ్లేజర్లపై ప్రాచీన సింధు లోయ ముద్రలను తలపించేలా బంగారు ముద్రలు, ఇతర చిత్రాలను పొందుపరిచారు. కాలర్‌పై ‘సప్త సింధు’ చిహ్నాన్ని, జేబుపై త్రివర్ణ పతకాన్ని ప్రముఖంగా ముద్రించారు. 112 మంది పురుష, 56 మంది మహిళలతో కలిపి మొత్తం 168 మంది సభ్యుల భారత జట్టు పారా ఆసియా క్రీడల్లో పాలుపంచుకుంటోంది. 11 క్రీడాంశాల్లో మనోళ్లు పోటీపడుతున్నారు. ఈనెల 24 వరకు జరిగే ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన మూడువేల మంది అథ్లెట్లు తలపడుతున్నారు. ఇక, 100 పతకాలు సాధించడమే ధ్యేయంగా పారా ఆసియాడ్ బరిలో దిగినట్టు..పారా అథ్లెటిక్స్ ప్రధాన కోచ్ సత్యనారాయణ తెలిపాడు. ఈమేరకు భారత క్రీడాకారులంతా సన్నద్ధమయ్యారని, వారు ఆ పతకాల లక్ష్యాన్ని చేరుకుంటారన్న ఆశాభావం వ్యక్తంజేశాడు. హాంగ్జౌ పారా ఆసియాడ్‌లో భారత్ (29-31-51) రికార్డు స్థాయిలో 111 పతకాలు కైవసం చేసుకున్న విషయం విదితమే.
ఇవి కూడా చదవండి:
విండీస్ సిరీస్: శ్రేయస్ అయ్యర్‌కు ‘ఇంపాక్ట్ ప్లేయర్’ అవార్డు
న్యూజిలాండ్ సిరీస్.. వైభవ్‌కు అవకాశం దక్కడం కష్టమే: పుజారా