మెస్సితో వాగ్వాదానికి దిగిన ఈజిప్టు కోచ్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:38 AM
ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా-ఈజిప్టు ప్రిక్వార్టర్స్ మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెస్సి, ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో అర్జెంటీనా-ఈజిప్టు ప్రిక్వార్టర్స్ మ్యాచ్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆఖరిలో 3 గోల్స్ చేసి అర్జెంటీనా అద్భుత విజయం సాధించింది. అయితే వీఏఆర్ చేసిన తప్పిదం వల్లే తాము ఓడిపోయామంటూ ఈజిప్టు ప్లేయర్లు, కోచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అర్జెంటీనాకే ప్రపంచ కప్ ఇవ్వాలని ఫిక్స్ చేసినట్లు ఫిఫాపై ఆరోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మెస్సి, ఈజిప్టు కోచ్ హొస్సామ్ హసన్‌లకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్‌లో ఒక దశలో 0-2తో వెనుకబడిన అర్జెంటీనా చివరి నిమిషాల్లో అద్భుత పునరాగమనం చేసింది. క్రిస్టియన్ రొమెరో 79వ నిమిషంలో గోల్ చేయగా.. నాలుగు నిమిషాల తర్వాత మెస్సీ స్కోరు సమం చేశాడు. అదనపు సమయంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్ చేయడంతో అర్జెంటీనా 3-2తో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. అయితే మ్యాచ్ చివరి నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో టచ్ లైన్ వద్ద ఈజిప్ట్ కోచ్ హొస్సామ్ హసన్, మెస్సి మధ్య జరిగిన వాగ్వాదం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన తర్వాత హసన్ ఫిఫా యాంటీ రేసిజం సంకేతాలు చేయడం మరింత చర్చకు దారితీసింది. ఈ చర్యను చూసి మెస్సి కూడా కాసేపు ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించాడు. మ్యాచ్ అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మెస్సి సహచర ఆటగాళ్లు కూడా అతడిని వెనక్కి తీసుకెళ్లారు.
ఇవి కూడా చదవండి:
సంజు శాంసన్‌ను అందుకే తప్పించాం.. క్లారిటీ ఇచ్చిన గంభీర్
ప్రపంచ కప్ అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారు: ఈజిప్టు ప్లేయర్