కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా..!
ABN , Publish Date - May 25 , 2026 | 11:55 AM
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్‌లో 31 సిక్సర్లు బాదిన కేఎల్.. అత్యధిక ఫ్రాంచైజీల తరఫున సీజన్‌లో కనీసం 30 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం తన బ్యాట్‌తో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్.. 30 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఈ సీజన్‌లో మొత్తంగా 31 సిక్సర్లు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్రాంచైజీల తరఫున సీజన్‌లో కనీసం 30 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు పంజాబ్ కింగ్స్ తరఫున 2018, 2021 సీజన్లలో 31, 30 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున 2022లో 30 సిక్సర్లు నమోదు చేశాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మరోసారి అదే ఘనతను అందుకుని అరుదైన ఫీట్ సాధించాడు.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. కేకేఆర్‌పై 40 పరుగుల తేడాతో గెలుపొందింది. 14 పాయింట్లతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే కేఎల్ రాహుల్ మాత్రం ఈ సీజన్‌లో అద్బుమైన ప్రదర్శన కనబర్చాడు. మొత్తంగా 14 ఇన్నింగ్స్‌ల్లో 593 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు, ఒక భారీ సెంచరీ ఉంది. పంజాబ్ కింగ్స్‌పై 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
ముంబైతో మ్యాచ్‌కు ఫిట్‌గా లేను.. కానీ బరిలోకి దిగా: రియాన్ పరాగ్
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ