IND VS NZ: భారత్ బ్యాటింగ్ పూర్తి.. న్యూజిలాండ్ టార్గెట్ 285
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:35 PM
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ పూర్తి చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 284 పరుగులు చేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఇవాళ(బుధవారం) భారత్, న్యూజిలాండ్(India vs New Zealand 2nd ODI) మధ్య రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచులో టీమిండియా స్టార్ బ్యాటర్ కె.ఎల్. రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 120 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును రాహుల్ తన శతకంతో ఆదుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లకు భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్(24) ఔటయ్యాక గిల్(56) అర్ధ సెంచరీ చేసి.. పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే శ్రేయస్ అయ్యర్(8), విరాట్ కోహ్లీ(23) ఔటయ్యారు. ఈ క్రమంలో 118 పరుగులకే నాలుగు వికెట్లు పడి.. కష్టాల్లో ఉన్న భారత్ ను కె.ఎల్.రాహుల్ ఆదుకున్నాడు.
రాహుల్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(27)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. రాహుల్ ఆచితూచి ఆడుతూ 87 బంతుల్లో తన ఎనిమిదో వన్డే సెంచరీ మార్క్(KL Rahul hundred)ను అందుకున్నాడు. మొత్తంగా రాహుల్ 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్లతో 112 పరుగులు చేసి నాటౌడ్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు సాధించాడు. అలానే జేమీసన్, ఫోక్స్, బ్రెస్‌వెల్ తలో వికెట్ సాధించారు.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ వరుసగా రెండో హాఫ్‌సెంచరీ..
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!