IND VS NZ: శుభ్‌మన్ గిల్ వరుసగా రెండో హాఫ్‌సెంచరీ..
ABN , Publish Date - Jan 14 , 2026 | 03:00 PM
రాజ్ కోట్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ చేశాడు. తొలి వన్డేలో కూడా గిల్ హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
స్పోర్ట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తర్వాత కాసేపటికే 56 పరుగుల(53 బంతుల్లో) వ్యక్తిగత స్కోర్ వద్ద కైల్ జెమీసన్ బౌలింగ్‌లో మిచెల్‌కి క్యాచ్ ఇచ్చి..పెవిలియన్ చేరాడు. తొలి వన్డేలో సైతం గిల్(71 బంతుల్లో 56) అర్ధ సెంచరీ చేశాడు. రాజ్‌కోట్ వేదికగా ఇవాళ(బుధవారం) భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయిన భారత్118 పరుగులు చేసింది.
ఓపెనర్ రోహిత్ శర్మ 38 బంతుల్లో 24 పరుగులు చేసి క్లార్క్ బౌలింగ్ లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు.70 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వచ్చిన వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీతో కలిసి శుభ్‌మన్ గిల్ స్కోర్ బోర్డు కదిలించాడు. అతడు 53 బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక శ్రేయస్ అయ్యార్ స్వల్ప(8 పరుగులు) పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(23),కే.ఎల్. రాహుల్(0) ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
బదోని ఎంపికపై తీవ్ర విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?
అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!