Share News

Ind Vs NZ: టాస్ ఓడిన భారత్.. నితీశ్ కుమార్ రెడ్డికి ఛాన్స్!

ABN , Publish Date - Jan 14 , 2026 | 01:15 PM

న్యూజిలాండ్-భారత్ జట్లు మధ్య రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

Ind Vs NZ: టాస్ ఓడిన భారత్.. నితీశ్ కుమార్ రెడ్డికి ఛాన్స్!
Ind Vs NZ

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్-భారత్ జట్లు మధ్య రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. అయితే ఈ మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గెలిచిన టీమిండియా 1-0తేడాతో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ పట్టేయాలని గిల్ సేన భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచులో తమ అద్భుత ప్రదర్శనతో కివీస్ జట్టు.. ఆఖరి ఓవర్‌కు తీసుకొచ్చి టీమిండియాకు ఒత్తిడిలోకి నెట్టి.. తృటిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది.


గాయంతో వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్‌కు ఇప్పటికే దూరమయ్యాడు. కాగా జట్టులోకి తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డిని తుది జట్టులోకి తీసుకున్నారు. కాగా అదొక్కటి మినహాయిస్తే.. తొలి వన్డేలో ఆడిన జట్టే ఇక్కడా ఆడనుంది.


భారత తుది జట్టు..

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.


న్యూజిలాండ్ తుది జట్టు..

డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(వికెట్ కీపర్), మిచెల్ బ్రేస్‌వెల్(కెప్టె్న్), జాకరీ ఫోక్స్, జాడెన్ లెనాక్స్, జెమీసన్, క్లార్క్.


ఇవి కూడా చదవండి:

బదోని ఎంపికపై తీవ్ర విమర్శలు.. బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే?

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో విరాట్!

Updated Date - Jan 14 , 2026 | 01:15 PM