Share News

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:37 PM

ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై కోహ్లీ స్పందించాడు.

చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన కుటుంబంతో కలిసి విరాట్ లండన్‌లో ఉంటున్నాడు. అతడు ఆడాల్సిన మ్యాచ్‌లు అవ్వగానే నేరుగా అక్కడికే చేరుకుంటాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆర్సీబీ మ్యాచ్‌లు లేనప్పుడు లండన్‌కు వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్ కావాలని ఫ్రాంచైజీని విరాట్ డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిపై కోహ్లీ స్పందించాడు.


మ్యాచ్‌ల మధ్య మూడు రోజుల విరామం ఉంటే లండన్ వెళ్లి, మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు తిరిగి జట్టులో చేరతానని కోహ్లీ ఫ్రాంచైజీని కోరినట్లు వార్తలు తెగ ప్రచారం జరుగుతున్నాయి. దీంతో విరాట్ ఆ వార్తలపై నేరుగా స్పందించకుండా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రెండు నవ్వు ఎమోజీలతో రియాక్ట్ అయ్యాడు. ఆ ప్రచారాలను ఖండించాడు. ఆ వార్త ఎంత హాస్యాస్పదంగా ఉందో చెప్పకనే చెప్పాడు.


ఇదిలా ఉండగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్‌ను మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడనుంది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత గత సీజన్‌లో తొలి ఐపీఎల్ టైటిల్ అందుకున్న కోహ్లీ.. ఈసారి కూడా దూకుడుగా రాణించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో 267 మ్యాచ్‌లు ఆడి 8,661 పరుగులు చేశాడు. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా విరాట్ నిలవనున్నాడు. గత సీజన్‌లో కోహ్లీ 15 ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసి, జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈసారి కూడా అభిమానులను అలరించే ఇన్నింగ్స్‌లతో మెరిసేలా కనిపిస్తున్నాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2026: ఢిల్లీ జట్టులోకి పునరాగమనం.. భావోద్వేగానికి గురైన పృథ్వీ షా

ఐపీఎల్ 2021: నా కెరీర్‌లోనే అది అత్యంత దారుణమైన సీజన్

Updated Date - Mar 22 , 2026 | 04:37 PM