ఐపీఎల్ 2026: కుమార్తెతో కలిసి రోహిత్ శర్మ క్రేజీ డ్యాన్స్.. వైరల్ వీడియో
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:57 PM
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రీ-సీజన్ ఈవెంట్ నిర్వహించింది. జియో వరల్డ్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఐ ప్లేయర్స్, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన కుమార్తె సమైరాతో కోసం డ్యాన్స్ వేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రీ-సీజన్ ఈవెంట్ నిర్వహించింది. జియో వరల్డ్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఐ ప్లేయర్స్, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన కుమార్తె సమైరాతో కోసం డ్యాన్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్‌గా మారిన వీడియోలో రోహిత్ తన చిన్నారి సమైరాతో సరదాగా స్టెప్పులు వేస్తూ కనిపించాడు. ఈ కార్యక్రమంలో ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య, తన స్నేహితురాలు మహీకా శర్మ, స్టార్ పేసర్ దీపక్ చాహర్, అతడి భార్య, టీమిండియా స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ పాల్గొన్నారు. ఈ వేడుకను అందరూ ఉత్సాహంగా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనుంది.
ఎంఐ గొప్ప జట్టు: ఇర్ఫాన్ పఠాన్
ఐపీఎల్‌లో గొప్ప జట్టు ఏది అని సోషల్ మీడియాలో జరుగుతోన్న చర్చపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ‘ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఐదేసి టైటిల్స్ గెలుచుకున్నాయి. అయిన్నప్పటికీ భారత క్రికెట్‌కు యువ ప్రతిభను అందించడంలో ఎంఐ ముందుంటుంది. ధోనీ నేతృత్వంలో సీఎస్కే 2010, 2011లో వరుసగా టైటిల్స్ గెలుచుకోగా, రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ 2019, 2020లో వరుసగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుంది’ అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ఢిల్లీ జట్టులోకి పునరాగమనం.. భావోద్వేగానికి గురైన పృథ్వీ షా
ఐపీఎల్ 2021: నా కెరీర్‌లోనే అది అత్యంత దారుణమైన సీజన్