Share News

ఐపీఎల్ 2026: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ విజయ లక్ష్యం ఎంతంటే?

ABN , Publish Date - May 10 , 2026 | 09:28 PM

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్‌పూర్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఆర్సీబీకి 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఐపీఎల్ 2026: తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ విజయ లక్ష్యం ఎంతంటే?
RCB vs MI

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్‌పూర్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎంఐ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఆర్సీబీకి 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తిలక్ వర్మ(57; 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు. నమన్ ధీర్(47; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) తృటిలో అర్ధ శతకాన్ని మిస్ చేసుకున్నాడు. అయితే ఆర్సీబీ స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో విజృంభించాడు.


రోహిత్ శర్మ(22), సూర్యకుమార్ యాదవ్(0)లను వరుస బంతుల్లో భువీ పెవిలియన్‌కు చేర్చాడు. ర్యాన్ రికెల్టన్(2), విల్ జాక్స్(10), రాజ్ బవా(16) విఫలమయ్యారు. బోష్(5*), దీపక్ చాహర్(1*) నాటౌట్‌గా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 4, హేజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్, షెఫర్డ్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

Updated Date - May 10 , 2026 | 09:28 PM