ఐపీఎల్ 2026: 13 బంతుల్లోనే ఉర్విల్ పటేల్ హాఫ్ సెంచరీ.. లఖ్‌నవూపై సీఎస్కే ఘన విజయం
ABN , Publish Date - May 10 , 2026 | 07:48 PM
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 204 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ ప్లేయర్ ఉర్విల్ పటేల్(65; 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి.. ఫాస్టెస్ట్ ఫిఫ్టీ జాబితాలో యశస్వి జైస్వాల్ రికార్డును సమం చేశాడు.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(42) రాణించాడు. సంజు శాంసన్(28), కార్తిక్ శర్మ(20), బ్రెవిస్(10) విఫలమయ్యారు. శివం దూబె(15*), ప్రశాంత్ వీర్(18*) నాటౌట్‌గా నిలిచారు. లఖ్‌నవూ బౌలర్లలో దిగ్వేశ్ సింగ్ 2, షాబాజ్ అహ్మద్ 2, ఆవేశ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీ ఓపెనర్ జోస్ ఇంగ్లిస్(85; 33 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఆఖరిలో షాబాజ్ అహ్మద్(43*; 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్(10), నికోలస్ పూరన్(1), రిషబ్ పంత్(15), మార్క్‌రమ్(6), అక్షత్ రఘువంశీ(18), హిమ్మత్ సింగ్(17), షమి(0) వెనువెంటనే పెవిలియన్ చేరాడు. సీఎస్కే బౌలర్లలో జెమీ ఓవర్టన్ 3 వికెట్లతో చెలరేగాడు. అన్షుల్ కాంబోజ్ 2, నూర్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్