ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో కీలక పోరు.. టాస్ గెలిచిన ఆర్సీబీ
ABN , Publish Date - May 10 , 2026 | 07:19 PM
ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎంఐ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఎంఐ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి. మరోవైపు ఆర్సీబీ ఈ పోరులో నెగ్గితే టాప్ 2లో స్థానం సంపాదిస్తుంది. కాగా ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. జట్టును సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. పదింట్లో ఆరు గెలిచిన ఆర్సీబీ.. 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పదింట్లో మూడు గెలిచిన ఎంఐ.. ఆరు పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది.
ఆర్సీబీ తుది జట్టు
రజత్ పాటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ దార్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: దేవదత్ పడిక్కల్, జోర్డన్ కాక్స్, మంగేశ్ యాదవ్, స్వప్నిల్ సింగ్, వెంకటేశ్ అయ్యర్
ఎంఐ తుది జట్టు
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, తిలక్ వర్మ, విల్ జాక్స్, రాజ్ బవా, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, బుమ్రా, ఘజన్‌ఫర్
ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: బౌల్ట్, రఘు శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, శార్దూల్ ఠాకూర్
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్