విజయ్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో సీఎస్కే స్టార్ బౌలర్.. అశ్విన్ ‘ఎక్స్’ పోస్ట్ వైరల్
ABN , Publish Date - May 10 , 2026 | 05:09 PM
తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ చేసిన ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రిగా సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఎక్స్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాణస్వీకారం వేడుకలో విజయ్ భద్రతా సిబ్బందిలో ఒకరు సీఎస్కే స్టార్ బౌలర్ అన్షుల్ కాంబోజ్‌లాగే ఉన్నాడంటూ అశ్విన్ సరదాగా పేర్కొన్నాడు. దీంతో దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ‘డ్యూటీ ఎప్పుడూ ముందే ఉండాలి. కానీ సీఎస్కే-ఎల్ఎస్‌జీ వంటి కీలక మ్యాచ్ రోజు ఇలా సెక్యూరిటీ డ్యూటీలో ఉండటం సబబు కాదు. ఇది మ్యాచ్ డే.. వెంటనే క్యాబ్ ఎక్కి చెపాక్‌కు చేరుకో అన్షుల్ కాంబోజ్’ అంటూ అశ్విన్ సరదాగా పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్ పెట్టిన కాసేపటికే నెటిజన్లు తెగ షేర్లు చేస్తున్నారు. ‘నిజంగానే అన్షుల్ లాగే ఉన్నాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు చెపాక్ స్టేడియం వేదికగా సీఎస్కే-ఎల్ఎస్‌జీ జట్లు తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న సీఎస్కేకు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. అయితే టాస్ ఓడిన లఖ్‌నవూ బ్యాటింగ్ చేస్తోంది. ఈ వార్త రాసే సమయానికి.. 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లిస్(85) హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై బౌలర్ ఓవర్టన్ 3 వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్