Share News

ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ పెద్ద వికెట్‌గా మారాడు: మహ్మద్ కైఫ్

ABN , Publish Date - May 10 , 2026 | 04:11 PM

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల కుర్రాడి వికెట్ తీయడం కోసం ప్రపంచ మేటి బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైభవ్ వికెట్ తీయగానే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.

ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ పెద్ద వికెట్‌గా మారాడు: మహ్మద్ కైఫ్
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్నాడు. 15 ఏళ్ల కుర్రాడి వికెట్ తీయడం కోసం ప్రపంచ మేటి బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైభవ్ వికెట్ తీయగానే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ జెమీసన్.. వైభవ్‌ను ఔట్ చేశాక అతిగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అతడిపై బీసీసీఐ చర్యలు కూడా తీసుకుంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ బౌలర్ సిరాజ్ కూడా వైభవ్‌ వికెట్ తీశాక గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఈ విషయంపై స్పందించాడు.


‘అప్పుడు కేల్ జెమీసన్.. ఇప్పుడు మహ్మద్ సిరాజ్.. ఈ ఇద్దరూ ఎంతో అనుభవం ఉన్న పేసర్లు. ఇలాంటి ప్రపంచ మేటి బౌలర్లు వైభవ్ వికెట్ తీసిన తర్వాత అతిగా సంబరాలు చేసుకోవడం చూస్తుంటే.. ఐపీఎల్‌లో15 ఏళ్ల కుర్రాడు ఎంత పెద్ద వికెట్‌గా మారాడో అర్థమవుతోంది. ఇది వైభవ్ సూర్యవంశీ కష్టానికి, ప్రతిభకు దక్కిన గుర్తింపు’ అని కైఫ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.


అరుదైన ఘనత..

గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 77 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ సిక్సర్ల పిడుగు వైభవ్.. ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం 29 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. 514 బంతుల్లోనే 100 సిక్సర్ల మార్క్‌ను అందుకుని మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.


ఇవి కూడా చదవండి:

రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్

Updated Date - May 10 , 2026 | 04:11 PM