ఐపీఎల్ 2026: జోష్ ఇంగ్లిస్ హాఫ్ సెంచరీ.. సీఎస్కే టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - May 10 , 2026 | 05:38 PM
ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. సీఎస్కేకి 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. సీఎస్కేకి 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎల్ఎస్‌జీ ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(85; 33 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
ఆఖరిలో షాబాజ్ అహ్మద్(43*; 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్(10), నికోలస్ పూరన్(1), రిషబ్ పంత్(15), మార్క్‌రమ్(6), అక్షత్ రఘువంశీ(18), హిమ్మత్ సింగ్(17), షమి(0) వెనువెంటనే పెవిలియన్ చేరాడు. సీఎస్కే బౌలర్లలో జెమీ ఓవర్టన్ 3 వికెట్లతో చెలరేగాడు. అన్షుల్ కాంబోజ్ 2, నూర్ అహ్మద్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్