ఐపీఎల్ 2026: తేలిపోయిన రాజస్థాన్ బ్యాటర్లు.. లఖ్‌నవూ ముందు స్వల్ప లక్ష్యం
ABN , Publish Date - Apr 22 , 2026 | 09:31 PM
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరుగుతోన్న మ్యాచులో ఆర్ఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరుగుతోన్న మ్యాచులో ఆర్ఆర్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఎల్ఎస్‌జీకి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రవీంద్ర జడేజా(43*; 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. వైభవ్ సూర్యవంశీ సహా మిగతా బ్యాటర్లంతా తీవ్రంగా విఫలమయ్యారు.
యశస్వి జైస్వాల్(22; 12 బంతుల్లో 4 ఫోర్లు), వైభవ్ సూర్యవంశీ(8), ధ్రువ్ జురెల్(0), రియాన్ పరాగ్(20), హిట్‌మేయర్(22), డొనొవాన్ ఫెర్రీరా(20) పెవిలియన్‌కు క్యూ కట్టారు. శుభమ్ దూబె(19*) నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజాతో కలిసి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎల్ఎస్‌జీ బౌలర్లలో షమి 2, ప్రిన్స్ యాదవ్ 2, మొహ్సిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ
భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు